హెచ్‌సీయూ భూ వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.10,000 కోట్లు స్కామ్ చేసిందంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కానీ ఆయన మాటలు కేటీఆర్ ఆరోపణలను ధృవీకరిస్తున్నట్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
హైదరాబాద్, గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం హెచ్‌సీయూ భూములపై ఐసీఐసీయు బ్యాంక్ నుంచి రూ.10,000 కోట్లు అప్పు తీసుకున్న మాట వాస్తవం. వాటి విలువ సుమారు రూ.30,000 కోట్లు కనుకనే బ్యాంక్ మాకు అప్పు ఇచ్చింది. ఆ సొమ్ముని పంట రుణాల మాఫీకి వినియోగించాము.
ఇటువంటి వ్యవహారాలలో బ్యాంకులకీ ప్రభుత్వానికి మద్య బ్రోకరేజ్ కంపెనీ ఉంటుందనే విషయం మంత్రిగా చేసిన కేటీఆర్‌కు తెలియదా? ఆవిదంగా బ్రోకరేజ్ చేసి రూ.10,000 కోట్లు అప్పు ఇప్పించినందుకు గాను ఆ సంస్థకు ప్రభుత్వం రూ. 170 కోట్లు బదిలీ చేసిన మాట వాస్తవం. ఇదంతా పూర్తి పారదర్శకంగానే జరిగింది.
హెచ్‌సీయూ భూములని బిల్లీరావుకి అప్పగించి 30 శాతం కమీషన్ తీసుకోవాలని కేటీఆర్ అనుకున్నారు. కానీ అధికారం కోల్పోవడంతో వీలు పడలేదు. మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కోట్లాది ఆ భూములు స్వాధీనం చేసుకొని వాటిని వేలం వేసేందుకు సిద్దపడగానే అవెక్కడ చేజారిపోతాయోనని కేటీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే మా ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్ళ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నేతల భూకబ్జాలపై బహిరంగ చర్చకు కేటీఆర్ రాగలరా?” అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.