రాజేంద్ర ప్రసాద్.. ఇవేం మాటలయ్యా!

March 25, 2025


img

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించిన డేవిడ్ వార్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా నుంచి వకచ్చారు. ఆయనకు రాబిన్‌హుడ్ టీమ్‌, అభిమానులు అందరూ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ఆయన కూడా వేదికపై నితిన్‌, శ్రీనిధి శెట్టి, కేతికా శర్మలతో కలిసి అదిదా సర్‌ప్రీజు.. పాటకి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. 

విదేశం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అటువంటి ప్రముఖుడి పట్ల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చాలా దారుణంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఫుల్‌గా మందుకొట్టి రావడమే తప్పు. వచ్చిన బుద్దిగా కూర్చోకుండా ఓ విదేశీ అతిధి పట్ల ఈవిదంగా మాట్లాడటం ఇంకా తప్పు. 

“ఒరేయ్ డేవిడ్ వార్నరూ నిన్ను క్రికెట్ ఆడుకోరా అంటే వచ్చి సినిమాలు చేస్తావా?” అంటూ చాలా చులకనగా మాట్లాడారు. 

ఆయనకు ఈ మాటలు అర్దం కాకపోయినా రాజేంద్ర ప్రసాద్ తన గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నారని గ్రహించారని ఆయన మొహంలో మారిన ఫీలింగ్స్ చూస్తే అర్దమవుతుంది. రాజేంద్ర ప్రసాద్ తాగిన మైకంలో ఆయన గురించి ఆవిదంగా మాట్లాడుతుంటే వేదికపై ఉన్న నిర్వాహకులు వారించకపోవడం చాలా శోచనీయం.            


Related Post