ఎప్పుడూ ఏదో వివాదంలోనే టాలీవుడ్‌

March 20, 2025


img

తెలుగు సినీ పరిశ్రమ గత కొన్నేళ్ళలో క్రమంగా జాతీయ, అతర్జాతీయ స్థాయికి ఎదగడం చాలా సంతోషకరం. కానీ మరోపక్క ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇదివరకు మాదక ద్రవ్యాల కేసులో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు చిక్కుకోగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్నారు. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్‌ చేస్తున్నందుకు మొత్తం 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో ప్రముఖ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ , విష్ణు ప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్స్ అనన్య నాగళ్ళ, హర్ష సాయి, శ్యామల తదితరులున్నారు.

వీరందరూ జంగిల్ రమ్మీ వంటి వివిద బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు ఆర్ధికంగా నష్టపోయే, మోసపోయే బెట్టింగ్ యాప్స్ కోసం సెలబ్రెటీలు పనిచేయడం నేరమనే విషయం వారు గ్రహించేసరికి చాలా ఆలస్యమైంది. మియాపూర్ పోలీసుల నుంచి నోటీస్ అందుకున్న సినీ నటి విష్ణు ప్రియ ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.


Related Post