కేసీఆర్‌ శాసనసభకు రారు.. పార్టీ సమావేశాలకు మాత్రమే హాజరు?

March 18, 2025


img

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలొ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్‌పై చాలా బాధ్యత ఉంది. శాసనసభలో ప్రభుత్వ విధానాలు, వైఫ్యల్యాల గురించి నిలదీస్తూ ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేయాలి. కానీ శాసనసభ సమావేశాలకు రాకుండానే వద్దనకుండా నెలనెలా జీతభత్యాలు తీసుకుంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 

కేసీఆర్‌ శాసనసభకు ఎందుకు రావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు అడుగుతుంటే కేటీఆర్‌, హరీష్ రావుల వద్ద సమాధానం లేదు. తుంటి ఎముక మార్పిడి చేయించుకున్నందున ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా?అంటే కాదు. 

ఏప్రిల్ 27న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలో ప్రవేశించబోతోంది కనుక రజతోత్సవ సభను లక్షమందితో చాలా అట్టహాసంగా నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

హరీష్ రావు తదితరులు అందుకు ఏర్పాట్లు చేస్తుండగా కేసీఆర్‌ వాటిని పర్యవేక్షిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌, శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా నెలనెలా ప్రభుత్వం నుంచి సుమారు రూ.2.50 లక్షలు జీతాభత్యాలు తీసుకుంటూ పార్టీ సమావేశాలకు మాత్రమే హాజరవుతుండటాన్ని ఏమనుకోవాలి? 


Related Post