కేసీఆర్‌ని గద్దె దించాలని కేటీఆర్‌ ప్రయత్నించారుగా?

March 16, 2025


img

తెలంగాణ శాసనసభలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను ఎన్నికలలో పోటీ చేసి ప్రజలు ఎన్నుకుంటేనే  ముఖ్యమంత్రినయ్యాను తప్ప బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌లాగ కేసీఆర్‌ ఎప్పుడు గద్దె దిగుతారా ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా?అని ఆశ పడలేదు. 

నాడు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనని ఆ కుర్చీలో నుంచి దించి తాను కూర్చోవాలని కేటీఆర్‌ ప్రయత్నించారు. కేటీఆర్‌ ముఖ్య అనుచరులుగా ఉన్న మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరుల చేత కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారంటూ చెప్పించారు కదా? 

కన్నతండ్రిని ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దించేసి ఆ కుర్చీలో కూర్చోవాలని కేటీఆర్‌ ఔరంగజేబ్‌లా ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా? వారే చెప్పాలి. 

కానీ నేను కేసీఆర్‌ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆయన ఎప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉండాలని, శాసనసభకు వచ్చి మా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


Related Post