అప్పులు, జీతాలు పోగా నెలకు 5,500 కోట్లు మాత్రమే చేతిలో

March 12, 2025


img

ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఆర్ధిక పరిస్థితి పాలకుల అనాలోచిత నిర్ణయాలు, తప్పిదాల వలన ఎంత దయనీయంగా మారిందో నేడు సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. 

తెలంగాణ నెలసరి ఆదాయం రూ.18,000-18,500 కోట్లు. దానిలో కేసీఆర్‌ చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్లు వెళ్ళిపోతుంది. రిజర్వ్ బ్యాంకులో 18,000 కోట్లు జమా అవగానే, నాకు ఇష్టమున్నా లేకున్నా బ్యాంకులు 6,500 కోట్లు కోసి తీసేసుకుంటాయి. ఇక మిగిలిన సొమ్ములో రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులతో సహా అన్ని రకాల ఉద్యోగులకు కలిపి రూ.6,500 కోట్లు వెళ్ళిపోతుంది. 

ఇక మిగిలిన 5,000-5,000 కోట్లతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయాలి. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి. సంక్షేమ పధకాలకు నిధులు కేటాయించాలి. ఇంకా అనేక ఖర్చులకు సొమ్ము చెల్లిస్తూనే ఉండాలి. ఈ సంక్షేమ పధకాలు, అభివృద్ధిపనులు, కాంట్రాక్టర్లకు కేసీఆర్‌ ఎగవేసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే నెలకు మరో 22,000 కోట్లు అవసరం ఉంటుంది. 

కానీ మనకు అంత ఆదాయం లేదు కనుక ఓసారి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని పక్కనపెట్టి ఆశా వర్కర్లకు జీతాలు ఇస్తాను. ఓనెల వారికి ఆపి అంగన్వాడీ లేదా మరొకరికి ఇస్తాను. ఆదాయం తక్కువ ఉన్న ఓ కుటుంబాన్ని ఏవిదంగా నడిపిస్తారో అలాగే నేను కూడా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాను. 

నాక్కూడా అందరికీ సకాలంలో జీతాలు చెల్లించాలని, అభివృద్ధిపనులు జరిపించాలని, ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేసి ప్రజల మెప్పు పొందాలని ఉంటుంది. కానీ కేసీఆర్‌ మహానుభావుడు విచ్చలవిడిగా చేసిన అప్పులతో నా రెండు చేతులు కట్టేసిన్నట్లయింది. 

ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి, బకాయిలు పెండింగ్ పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి వెళ్ళిపోయిన ఆ పెద్దమనిషి, హామీలు ఎందుకు అమలుచేయడం లేదని నన్ను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ తెలియాలనే నేను వివరించాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 



Related Post