బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్.. సాధ్యమేనా?

March 07, 2025


img

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ 42 శాతం పెంచేందుకు ముసాయిదా బిల్లుని మంత్రివర్గ సమావేశం ఆమోదించి శాసనసభలో దీని కోసం తీర్మానం చేయబోతోంది.

కానీ అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఉన్నప్పుడు, బీసీలకే 42 శాతం కేటాయిస్తే మిగిలినవర్గాలతో కలిపి 60-70 శాతం చేరుకుంటుంది. కనుక దీని కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

కానీ గతంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్, బీసీలకు 37 శాతం పెంచుతూ శాసనసభ తీర్మానాలు చేసి పంపితే వాటినే కేంద్రం చెత్తబుట్టలో పడేసింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ 37 నుంచి 42 శాతానికి పెంచుతూ శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం పట్టించుకుంటుందా? అంటే కాదనే అర్దమవుతుంది.

సాధ్యం కాదని తెలిసి ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్స్ కోసం శాసనసభలో తీర్మానం చేయడం దేని కోసం?అంటే అందరికీ తెలుసు. 

ఆనాడు కేసీఆర్‌ మేము ముస్లింల సంక్షేమానికి కట్టుబడి రిజర్వేషన్స్ పెంచాలని తీర్మానం చేసి పంపాము కానీ కేంద్రం సహకరించలేదంటూ ముస్లింలను మంచిచేసుకుంది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బీసీలకు ఇవే మాటలు చెప్పబోతోందా?


Related Post