బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
ఇటీవల ఈ కేసు విచారణ చేపట్టినప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో లేదా ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలియజేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. దానిపై వెంటనే స్పందించిన శాసనసభ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ కోరుతూ నోటీసులు పంపారు.
కనుక నేటి విచారణలో అదే విషయం తెలియజేసి మరికొంత సమయం కావాలని కోరవచ్చు. తెలంగాణ ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి అభ్యర్ధన మేరకు ఈ కేసు మరోసారి వాయిదా పడవచ్చు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏమైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తే చేయవచ్చు తప్ప బిఆర్ఎస్ పార్టీ, వారి సొంత మీడియాయ చెప్పుతున్నట్లు ఏదో జరిగిపోయే అవకాశం లేదు.