కేసీఆర్‌ వచ్చేస్తున్నారు.. కాంగ్రెస్‌, బీజేపి రెడీయా?

February 13, 2025


img

దాదాపు ఏడాదిగా ఫామ్‌హౌస్‌లో ఉండిపోయిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్‌గా కాబోతున్నారు. ఈ నెల 19న మద్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగబోతోంది. దానికి కేసీఆర్‌ హాజరుకాబోతున్నారు.

కనుక పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు అందరూ తప్పనిసరిగా ఈ సమావేశంలో పాల్గొనాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆదేశించారు. 

ఈ సమావేశంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్య కార్యాచరణ, పార్టీలో మార్పులు చేర్పులు తదితర అంశాల గురించి కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు. 

బిఆర్ఎస్ పార్టీ చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కేసీఆర్‌ రాకతో మళ్ళీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. దాదాపు ఏడాది విరామం తర్వాత కేసీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారు కనుక ఆయన కొత్తగా ఏమైనా చేసి కాంగ్రెస్‌, బీజేపిలపై పైచేయి సాధిస్తారా లేక పార్టీని సమర్ధంగా నడిపించలేక తన బలహీనతని బయటపెట్టుకుంటారా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.  


Related Post