తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి కుల గణన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మొదటిసారి చేసిన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంటే తక్కువ చేసి చూపారని, లక్షలమంది వివరాలు నమోదు చేయకుండానే మమ అనిపించేశారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ సర్వే నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని తీవ్రంగా తప్పు పట్టాయి. రాష్ట్రంలో బీసీలు, మాలలు పోరాటాలకు సిద్దమయ్యారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గి మళ్ళీ సర్వేకు సిద్దమైంది. అయితే రీసర్వే కాదని పొడిగింపు మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మొదటిసారి సర్వే చేసినప్పుడు అనేకమంది సమాచారం ఇవ్వకపోవడంతో వారు కూడా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సర్వేని ఈ నెల 28 వరకు పొడిగించామని చెప్పారు.
కుల గణన సర్వే గురించి సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు గొప్పగా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్వే చేయిస్తుండటం వలన దీనిపై ప్రతిపక్షాల వాదనలు సహేతుకమని అంగీకరించిన్నట్లు అయ్యింది కదా?
దేశానికి రూల్ మోడల్ గా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే: మంత్రి పొన్నం
ఇది రీ సర్వే కాదు.. కొంత మంది తమ సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నెల 28 వరకు మరోసారి గడువు ఇచ్చాం
స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాం
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా… pic.twitter.com/jjHIKgoveY