రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపు ఏడాదిగా సాగుతోంది. కానీ ఇంతవరకు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడిన స్పెషల్ ఇంటలిజన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులని అమెరికా నుంచి తిరిగి రప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.
కనుక వారిని రప్పించేందుకు చివరి అస్త్రంగా ఇద్దరినీ నేరస్థులుగా ప్రకటింపజేసేందుకు పోలీస్ శాఖ న్యాయస్థానంలో ఓ పిటిషన్ వేసింది.
ఒకవేళ న్యాయస్థానం అందుకు అంగీకరిస్తే వారిద్దరికీ నోటీసులు జారీ చేస్తుంది. నెలరోజులలోగా కోర్టులో హాజరుకాకపోతే తప్పించుకు తిరుగుతున్న నేరస్థులుగా కోర్టు ప్రకటిస్తుంది. దాని ఆధారంగా పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. అప్పుడు వారిరువురినీ అమెరికా పోలీసులే అరెస్ట్ చేసి హైదరాబాద్ తిప్పి పంపించాల్సి ఉంటుంది.
కానీ ఇదంతా చూస్తుంటే ఎప్పటికైనా ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుందా?ఒకవేళ ఈ కేసు మరో నాలుగేళ్ళు సాగి ప్రభుత్వం మారితే ఈ కేసులన్నీ అటకెక్కిపోకుండా ఉంటాయా?