కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిఎం సమావేశాలు!

January 30, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి సమగ్ర కుటుంబ సర్వే నివేదికపై చర్చించారు. అంతకు ముందు కూడా అక్కడే మంత్రులు, ఉన్నతాధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు. తెలుగు సినీ ప్రముఖులతో అక్కడే సమావేశమయ్యారు. అంటే సిఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని తన కార్యాలయంగా వినియోగించుకుంటున్నారనిపిస్తుంది. 

అయితే మాజీ సిఎం కేసీఆర్‌ వాస్తు ప్రకారం, సకల సౌకర్యాలతో నగరం నడిబొడ్డున కట్టించిన సువిశాలమైన సచివాలయం అందుబాటులో ఉండగా సిఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటి?అనే సందేహం కలుగక మానదు. 

రెండు మూడు నెలల క్రితం సిఎం రేవంత్ రెడ్డి కొత్త సచివాలయ ప్రధాన ద్వారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయించిన సంగతి తెలిసిందే. అంటే ఆయన కూడా సచివాలయానికి వాస్తుదోషాలు ఉన్నాయని భావిస్తున్నారా? అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని వినియోగించుకుంటున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


Related Post