కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకాలపై జస్టిస్ పినాకి చంద్ర బోస్ కమీషన్ విచారణ దాదాపు పూర్తికావచ్చింది. త్వరలోనే మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కూడా ప్రశ్నిస్తే విచారణ పూర్తవుతుంది. కానీ వారిరువురూ రాకపోవచ్చు కనుక ఫిబ్రవరిలో శాసనసభ సమావేశాలు మొదలయ్యేలోగా నివేదికని సిఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టేస్తారని తెలుస్తోంది.
శాసనసభ సమావేశాల సమయానికి నివేదిక వస్తే దానిపై కాంగ్రెస్, బిఆర్ఎస్ సభ్యుల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగవచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? అంటే ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసీఆర్, హరీష్ రావులపై కేసులు నమోదు చేయడంతో మరో కొత్త అధ్యాయం, కొత్త డ్రామా మొదలవుతాయని చెప్పొచ్చు.
కొత్త డ్రామా అని దేనికంటే ఎఫ్-1 రేసింగ్ కేసు అదే జరుగుతోంది కనుక. ఆ కేసులోనే కేటీఆర్‌ని ఇంతవరకు అరెస్ట్ చేయలేనప్పుడు, కేటీఆర్‌ని అరెస్ట్ చేయగలదా? అదీ జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు?అంటే కాదనే చెప్పొచ్చు. కనుక కాళేశ్వరం కమీషన్ రిపోర్టుతో కొత్తగా జరిగేది ఒరిగేది ఏమీ ఉండకపోవచ్చు.