బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కొందరికి డబ్బు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ, నాయకత్వం గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్లు గమనించామని దానిలో పేర్కొంది.
సోషల్ మీడియాలో తమ పార్టీ గురించి తప్పుడు వార్తలు లేదా తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్నవారికి ఇదే చివరి హెచ్చరిక అని, ఇకపై ఎవరైనా దుష్ప్రచారం చేసిన్నట్లయితే వారిపై పోలీసులకు పిర్యాదు చేస్తామని, న్యాయపరంగా కూడా పరువునష్టం దావా కేసులు కూడా వేస్తామని బిఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది.