మంచు మనోజ్ మరోసారి వార్తలలోకి ఎక్కారు. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా తన భార్య మౌనిక రెడ్డితో కలిసి తిరుపతిలొ మోహన్ బాబు యూనివర్సిటీ ఆవరణలో ప్రవేశించబోయారు. కానీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు వారిని అడ్డుకొని తిప్పి పంపేశారు.
ఉదయం తిరిగి వెళ్ళిపోయిన మంచు మనోజ్ మళ్ళీ సాయంత్రం తన అనుచరులను వెంటపెట్టుకొని యూనివర్సిటీ వద్దకు వచ్చి లోనికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కానీ బయట పోలీసులు అడ్డుకోగా, యూనివర్సిటీ సిబ్బంది లోపల నుంచి గేట్లు తాళాలు వేసి రాకుండా ఆపారు.
దాంతో మంచు మనోజ్ వారితో వాగ్వాదానికి దిగి "నన్ను చూసి మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? నేనేమీ గొడవ పడటానికి రాలేదు. కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యని మీరందరూ ఎందుకు పెద్దది చేస్తున్నారో నాకు అర్దం కావడం లేదు.
పెద్దల పండగ కనుక యూనివర్సిటీ ఆవరణలో ఉన్న మా తాత, నానమ్మ సమాధులకు దణ్ణం పెట్టుకొని నేను వెళ్ళిపోతాను. నన్నెందుకు లోపలకు రానీయడం లేదు?నన్ను చూస్తే మీ అందరికీ ఎందుకు అంత భయం?" అని యూనివర్సిటీ సిబ్బందిపై మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదివరకు జల్‌పల్లి నివాసంలో గొడవలు జరిగినప్పుడు రాచకొండ సీపీ సుధీర్ బాబు మనోజ్, విష్ణు ఇద్దరినీ తన కార్యాలయానికి పిలిపించి వార్నింగ్ ఇచ్చి, ఇద్దరిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయించారు. యూనివర్శిటీలోకి మంచు మనోజ్ ప్రవేశించరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయినా మంచు మనోజ్ యూనివర్సిటీ వద్దకు వెళ్ళి హడావుడి చేస్తున్నారు. దీనికి మీడియా, ఏపీ పోలీసులే సాక్ష్యం. కనుక మంచు మనోజ్ చేజేతులా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారనే చెప్పొచ్చు. అతనిపై మంచు విష్ణు లేదా మోహన్ బాబు పిర్యాదు చేస్తే ఈసారి జైలుకి వెళ్ళాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.
మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఎవడి పర్మిషన్ తీసుకోవాలి | ABN Telugu#manchumanoj #manchuvishnu #manchumohanbabu #abntelugu pic.twitter.com/EojrCRn1FG