ఫార్ములా 1 రేసింగ్ కేసుని కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఆయనని డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు విధించిన గడువు నేటితో ముగుస్తుంది. కనుక ఈరోజు హైకోర్టు తీర్పు ఆయనకు చాలా కీలకం.
ఒకవేళ ఈ కేసుని తదుపరి విచారణకు వాయిదా వేసిన్నట్లయితే అంతవరకు అరెస్ట్ చేయకుండా గడువు పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో ఆర్ధిక లావాదేవీలలో నిబంధనల ఉల్లంఘన జరిగిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది కనుక కేటీఆర్ న్యాయవాదుల వాదనలు ఫలించకపోవచ్చు. కానీ అరెస్ట్ చేయకుండా మరింత గడువు సాధించే అవకాశం మాత్రం ఉంది.
ఒకవేళ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ కొట్టివేసిన్నట్లయితే, వెంటనే ఏసీబీ అధికారులు విచారణకు రప్పించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కనుక కేటీఆర్ కొత్త సంవత్సరం ఏవిదంగా ప్రారంభం అవుతుందో హైకోర్టు చేతిలోనే ఉంది. మరికొన్ని గంటలలో విచారణ ముగిస్తే తెలుస్తుంది.