నిర్ణయం నాది తప్పు అధికారులదీ: కేటీఆర్‌

December 28, 2024


img

ఫార్ములా 1 రేసింగ్ కేసులో నేడు హైకోర్టులో కేటీఆర్‌ కౌంటర్ దాఖలు చేశారు. మంత్రిగా నేను ప్రభుత్వం తరపున ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, దాని అమలుచేసేటప్పుడు విధివిధానాలు సరిచూసుకొని పాటించాల్సిన బాధ్యత సంబందిత అధికారులదే తప్ప నాది కాదు. కనుక ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఒకవేళ నిబంధనలు ఉల్లంఘన జరిగి ఉంటే వాటికి సంబందిత అధికారులే పూర్తి బాధ్యులు తప్ప మంత్రిగా నేను కాదు,” అని దానిలో పేర్కొన్నారు. 

ఈ కేసులో ఫెమా, రిజర్వ్ బ్యాంక్ నిబందనలకు విరుద్దంగా కేటీఆర్‌ మౌకిక ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ లండన్‌లోని రేసింగ్ కంపెనీకి రూ.53 కోట్లు బదిలీ చేసింది. దీనినే ఏసీబీ తప్పు పడుతూ కేటీఆర్‌పై కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ కూడా వేరేగా కేసు నమోదు చేసింది. 

ఆర్ధిక నేరం కేసులో చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం కనుక కేటీఆర్‌ సింపుల్‌గా నాకు సంబందం లేదు అధికారులే దీనికి బాధ్యులు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. కానీ ఇదే కేటీఆర్‌ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, “దీనికి పూర్తి బాధ్యత నాదే. అధికారులకు సంబంధం లేదు. నా ఆదేశం మేరకే వారు నగదు బదిలీ చేశారు. కనుక దీనికి నేనే పూర్తి బాధ్యత తీసుకుంటాను,” అని చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చి తనకు సంబంధమే లేదని చెపుతున్నారు.


Related Post