సిఎంతో సమావేశానికి టాలీవుడ్‌ నుంచి 50 మంది

December 26, 2024


img

అల్లు అర్జున్‌ వివాదం తదనంతర పరిణామాలపై సిఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు టాలీవుడ్‌ నుంచి 50 మంది హాజరయ్యారు. వారిలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. వారందరూ ఎఫ్డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారు. ఇంకా సమావేశం కొనసాగుతోంది. ముగిసిన తర్వాత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వారు మీడియాకు వివరిస్తారు. 

ఈ సమావేశానికి హాజరైన నిర్మాతలు: దిల్‌రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్, డీవీ దానయ్య, కేఎల్ నారాయణ, స్రవంతి రవి కిషోర్, టీజీ విశ్వప్రసాద్, సునీల్, గోపీ ఆచంట, సి. కళ్యాణ్, యూవీ వంశీ, నాగవంశీ, సుధాకర్ రెడ్డి, దామోదర్, చినబాబు, కిరణ్, రవి, అనుపమ,  రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్, నాగబాబు. 

దర్శకులు: కే రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల రావిపూడి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, బాబీ, వేణు ఎల్దండి, వేణు శ్రీరామ, ప్రశాంత్ ప్రశాంత్ వర్మ, వీర శంకర్. 

నటులు: నాగార్జున, వెంకటేష్, నితిన్, కళ్యాణ్ రామ్, సాయి ధరం తేజ్, కిరణ్ అబ్బవరం, అడవి శేష్, రామ్ పోతినేని, సిద్ధూ జొన్నలగడ్డ, శివ బాలాజీ, విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. 

సినీ పరిశ్రమలో పెద్దన్నగా ఉన్న చిరంజీవి, ఇటీవల వివాదాలతో సతమతమవుతున్న మంచు కుటుంబం నుంచి ఎవరూ కీలకమైన ఈ సమావేశానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మా అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణు ఈ సమావేశానికి హాజరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   



Related Post