సంధ్య థియేటర్ ఘటనపై విచారణకు హాజరు కావాలని నోటీస్ అందడంతో అల్లు అర్జున్ మగ ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. నిజానికి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా పోలీసులు ఇదేవిదంగా నోటీస్ పంపితే చాలా హుందాగా ఉండేది. కానీ కాస్త హడావుడి చేసి విమర్శల పాలయ్యారు.
పోలీసుల నుంచి నోటీస్ అందుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచారణకు హాజరుకాకుండా కోర్టుని ఆశ్రయించి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అల్లు అర్జున్ పోలీసులు పిలవగానే వారితో వెళ్ళి అరెస్ట్ అయిన తర్వాతే హైకోర్టుని ఆశ్రయించి మద్యంతర బెయిల్ పొందారు. ఈరోజు కూడా నోటీస్ పంపగానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి హుందాగా వ్యవహరించారు.
అల్లు అర్జున్ అరెస్ట్-తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలను పక్కన పెడితే దీనిపై రాజకీయాలు చేయాలనుకున్న ప్రతీ ఒక్కరూ ఎదురు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం ఇరువైపులా పూర్తి సంయమనం పాటిస్తున్నారు.
కనుక తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన్నట్లుగా ఇక చట్ట ప్రకారం ఏం జరగాలో పోలీసులు, అల్లు అర్జున్ న్యాయవాదులు చూసుకుంటారు. కనుక ఈ కేసులో రాజకీయ పార్టీలు, నాయకులు దూరంగా ఉంటే అందరికీ మంచిది. కానీ సరిగ్గా పావులు కడిపితే ఎంతో కొంత రాజకీయ మైలేజ్ పొందడానికి అవకాశం గల ఈ వ్యవహారానికి రాజకీయ నాయకులు దూరంగా ఉండటానికి ఇష్టపడతారా?