గత కొన్ని నెలలుగా సిఎం రేవంత్ రెడ్డి ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నామని చాలా స్పష్టంగానే చెపుతున్నారు. అలాగే తరచూ ఫిలిమ్ స్టార్, పొలిటికల్ స్టార్ అంటూనే ఉన్నారు.
చెప్పిన్నట్లుగానే ముందు ఫిలిమ్ స్టార్ (అల్లు అర్జున్)ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. తద్వారా పొలిటికల్ స్టార్ (కేటీఆర్)ని అరెస్ట్ చేసేందుకు ‘భయపడేదేలే’ అని సూచించారు.
ఆ సిగ్నల్‌ని అందరి కంటే ముందుగా కేటీఆరే అందుకొని అరెస్ట్‌ని ఖండించారు కూడా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చెప్పిన్నట్లుగానే ఫిలిమ్ స్టార్ తర్వాత పొలిటికల్ స్టార్ అరెస్ట్‌కి రంగం సిద్దం చేశారు.
కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పు పడుతూ శాసనసభలో హరీష్ రావు చేసిన వాదనలకు సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే బదులిచ్చారు. పైగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ తీరుని శాసనసభ సాక్షిగా ఎండగట్టారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల ఇంత వరకు తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయలు ఉండి ఉండవచ్చు. కానీ శనివారం శాసనసభలో రేవంత్ రెడ్డి వాదనలు విన్న తర్వాత ఆయన నిర్ణయం సరైనదే అని అందరూ అంగీకరించవచ్చు.
అల్లు అర్జున్‌కి సంఘీభావం తెలిపిన సినీ ప్రముఖులకు కూడా సిఎం రేవంత్ రెడ్డి శాసనసభ నుంచే చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. పైగా ఇకపై ప్రివిలేజ్ షోలకు అనుమతించబోనని చెప్పడం యావత్ సినీ పరిశ్రమకి శిక్ష విధించిన్నట్లే భావించవచ్చు.
కనుక ఇప్పుడు సినీ పరిశ్రమ అల్లు అర్జున్‌కి మళ్ళీ సంఘీభావం తెలిపేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే ఇకపై బిఆర్ఎస్ పార్టీతో అంట కాగేందుకు కూడా వెనుకంజవేయవచ్చు.
ఒకే దెబ్బతో అటు తన ప్రభుత్వాన్ని గౌరవించని సినీ పరిశ్రమకి, ఇటు బిఆర్ఎస్ పార్టీకి కూడా చెక్ పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి రియల్ పొలిటికల్ స్టార్ అని చెప్పక తప్పదు.