సినీ ప్రముఖులపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్

December 21, 2024


img

ఈరోజు శాసనసభలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, సిఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులపై, అల్లు అర్జున్‌ని వెనకేసుకు వస్తూ తమ ప్రభుత్వాన్ని విమర్శించిన బిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.

“అల్లు అర్జున్‌ మీద ఎంతో అభిమానంతో ఆ కుటుంబం రూ.3,000 ఖరీదు చేసే టికెట్లను రూ.12,000 పెట్టి కొనుగోలు చేసి సినిమా చూసేందుకు వెళ్ళి తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు నేటికీ కోమాలో ఉన్నారు.

అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేస్తే ఏదో ప్రళయం ముంచుకొచ్చేసిన్నట్లు సినీ ప్రముఖులు అందరూ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఏం ఆయనకు ఏమైనా కాలు విరిగిందా చెయ్యి విరిగిందా?

ఆయన ఇంటికి క్యూ కట్టిన వారిలో ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు ఆస్పత్రిలో కోమాలో ఉన్న ఆ బాలుడిని చూసేందుకు వెళ్ళలేదు. ఇదేనా మీ మానవత్వం.. పెద్దరికం? సినీ ప్రముఖుడో, రాజకీయ నాయకుడో అయితే అతనికి చట్టాలు వర్తించవా?

నేరం చేసినప్పుడు పోలీసులు అరెస్ట్‌ చేయకూడదా? కూడదంటే చట్టం చేద్దాము..” అంటూ సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారో ఆయన మాటలలోనే వింటే ఈవిదంగా ఎందుకు మాట్లాడారో అర్దమవుతుంది. 

(video courtecy: 10TV)

Related Post