మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తిరుమలలో తెలంగాణ భక్తులకు, రాజకీయ నాయకులకు, ఇతర ప్రముఖుల పట్ల వివక్ష కనిపిస్తోంది. గతం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానీ, విడిపోయిన తర్వాత గానీ మేము ఎన్నడూ ఇటువంటి వివక్ష చూడలేదు. ఇప్పుడే తొలిసారిగా వివక్ష ఎదుర్కొన్నాము. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదు.
తెలంగాణలో పుట్టిన ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు. తిరుమల శ్రీవారు అందరికీ దేవుడే. కనుక మా ప్రాంతంలో తిరుమల ఉంది కనుక మేము తెలంగాణ నుంచి వచ్చే భక్తుల పట్ల వివక్ష చూపుతామనుకోవడం సరికాదు. టీటీడీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కనుక ఈవిదంగా చేయవద్దని నేను టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
తిరుమలకు తెలంగాణ నుంచి మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు, ప్రముఖులు వస్తూనే ఉంటారు. కానీ ఎవరి పట్ల టీటీడీ వివక్ష చూపిన దాఖలాలు లేవు. అసలు టీటీడీకి అటువంటి అవసరం కూడా లేదు. టీటీడీ అందరినీ గౌరవంగా చూస్తుంది.
ముఖ్యంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక, న్యాయ ప్రముఖులకు రాచామర్యాదలు చేస్తుంటుంది. కనుక మాజీ మంత్రినైనా తనకూ అటువంటి రాచమర్యాదలు చేస్తుందని శ్రీనివాస్ రెడ్డి భావించి, జరుగకపోతే నిరాశ చెంది ఉండవచ్చు. లేదా ఆయన సిఫార్సు లేఖని టీటీడీ తిరస్కరించి ఉండవచ్చు. ఆయన అసంతృప్తికి ఈ రెండే కారణాలు కనిపిస్తున్నాయి తప్ప వివక్ష కానే కాదని చెప్పొచ్చు.
(video source: great andhra)