నా జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే: రష్మిక

December 18, 2024


img

రష్మిక మందన ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌ని విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “జీవిత భాగస్వామి అంటే ప్రతీ దశలోనూ తోడుగా ఉండాలి. నాకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలి. జీవితంలో నాకు భద్రత కల్పించాలి. నాపట్ల ప్రేమ, శ్రద్ద చూపాలి. నా సమస్యలను అర్దం చేసుకొని సహకరించాలి. ప్రేమలో ఉండటం అంటేనే జీవిత భాగస్వామితో ఉన్నట్లే. జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. పరిపూర్ణం అవుతుంది,” అని చెప్పారు.

రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం ఇప్పుడు రహాస్యమేమీ కాదు. కానీ ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియదన్నట్లు రష్మిక మాట్లాడుతుండటం విచిత్రంగా అనిపిస్తుంది. తాను కోరుకున్న లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయనే కదా ప్రేమిస్తోంది?విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నప్పుడు మళ్ళీ తన జీవిత భాగస్వామి ఏవిదంగా ఉండాలని కోరుకుంటున్నానో రష్మిక చెప్పడం తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడిగినట్లే ఉందనిపిస్తుంది. 

జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, అభిమానం, గౌరవం, తోడ్పాటు, సహకారం ఆశించడంలో తప్పు లేదు కానీ స్వశక్తితో సినీ పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా రష్మిక వంటి హీరోయిన్లు జీవిత భాగస్వామి నుంచి భద్రత ఆశిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది.


Related Post