పాపం బిఆర్ఎస్ పార్టీ: జమిలి నిరాశ

December 14, 2024


img

తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగే లేదనుకున్న కేసీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీ నేతలకి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వెంట వెంటనే రెండుసార్లు ఓడిపోవడం పెద్ద షాక్. ఆ షాక్ నుంచి తెరుకునేలోగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంప్ అయిపోయారు.

మరోపక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్ట్‌ చేసేందుకు అనేక కేసులను సిద్దం చేస్తోంది. ఇంత జరుగుతున్నా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత వస్తానని కేటీఆర్‌ చేత చెప్పిస్తున్నారు. 

ఇటువంటి పరిస్థితులలో మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనకి ఆమోదముద్ర వేసి పార్లమెంటులో ప్రవేశపెడుతుండటం, బిఆర్ఎస్ పార్టీకి, దానిలాగే ఓడిపోయిన వైసీపీ వంటి అనేక ప్రాంతీయ పార్టీలకు ఆశలు చిగురించాయి.

2027లో జమిలి ఎన్నికలు జరుగవచ్చనే ఊహాగానాలతో ఏర్పడిన సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. జమిలి ఎన్నికలు 2035 తర్వాతే నిర్వహించాలని ఆ బిల్లులో చేసిన ప్రతిపాదనే ఇందుకు కారణం.

కనుక ఇప్పట్లో జమిలి ఎన్నికలు లేవు కనుక మళ్ళీ 2028లో శాసనసభ ఎన్నికలు జరిగేవరకు బిఆర్ఎస్ పార్టీ ఎదురుచూడక తప్పదు. అంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉండాలి. తప్పదు! 


Related Post