మంచులో గుద్దులాటలు లేవు..అంతా ఓపెన్... ఫైట్స్!

December 10, 2024


img

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో మోహన్ బాబు ఒకరు. ఆయన తన స్వయంకృషి, ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారు. ఆస్తులు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.

కానీ అవన్నీ ఆస్తుల కోసం తండ్రీ కొడుకుల మద్య జరుగుతున్న గొడవలతో తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇద్దరూ పరస్పరం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేసుకోవడంతో వారి ప్రతిష్ట మంచులా కరిగిపోగి, నవ్వులపాలవుతున్నారు. 

అంతటితో ఆగకుండా మంచు మనోజ్ తండ్రి దుష్ప్రవర్తన, ఆర్ధిక నేరాలు, కుటుంబ రాజకీయాలు అన్నిటినీ పూస గుచ్చిన్నట్లు వివరిస్తూ సోషల్ మీడియాలో పెట్టేయడంతో ఇప్పుడు వారి ఇంట్లో గొడవల లోకమంతటికీ తెలిసిపోయింది. కనుక ఇప్పుడు ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. 

ఇండస్ట్రీలో మంచు కుటుంబాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నవారికి కూడా ఇప్పుడు తమ కుటుంబం పరువు తీయడానికి వారు చేజేతులా అవకాశం కల్పించిన్నట్లయింది. 

ఏది ఏమైనప్పటికీ, మంచు మనోజ్ తండ్రికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు పోలీసులకు సమర్పిస్తానని చెపుతున్నారు కనుక కుటుంబం ఆర్ధిక మూలాలు కూడా దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తోంది. 

మెగా, అక్కినేని, అల్లు అర్జున్‌ మూడు కుటుంబాలు మంచు కుటుంబం కంటే చాలా భారీగానే పేరు ప్రతిష్టలు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ ప్రతీ కుటుంబంలో సభ్యులు కలిసి కట్టుగా ఉంటూ సమాజంలో ఇంకా గొప్పగా గౌరవం పొందుతున్నారు. కనుక మంచు కుటుంబం కూడా వారి పేరు ప్రతిష్టలు, ఆస్తులు మంచులా  పూర్తిగా కరిగిపోకముందే జాగ్రత్త పడితే మంచిది కదా?


Related Post