2007లోనే తెలంగాణ తల్లి విగ్రహం.. చూశారా?

December 08, 2024


img

ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదాలు నడుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపే తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనుకున్నారు. 2014 జూన్2 న తెలంగాణ ఏర్పడగా, ఆమె 2007, జనవరి 25వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలంలో బేగంపేటలో ఆమె మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహం అవిష్కరించారు. 

ప్రస్తుతం కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతుండటంతో నాడు విజయశాంతితో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఆ విగ్రహం ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిపై విజయశాంతి స్పందిస్తూ, ఆ ఫోటో షేర్ చేసిన తెలంగాణ ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలిపారు. 

నాడు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన విగ్రహంలాగే ఉండటం విశేషం.


Related Post