భారత్‌ రుణం బాంగ్లాదేశ్ ఇలా తీర్చుకుంటోందా?

December 06, 2024


img

భారత్ చొరవ వలననే బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ని తీవ్రంగా ద్వేషిస్తోంది. ఇస్కాన్‌కు చెందిన స్వామి చిన్మయ కృష్ణ దాస్‌ని అరెస్ట్ చేసింది. ఆయన తరపు వాదించడానికి వచ్చిన హిందూ న్యాయవాదిపై అల్లరి మూకలు దాడి చేశాయి. 

తమ దేశంలో హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. మైనార్టీ హిందువులను వేధిస్తున్నారు. దీనికంతటికి కారణం, బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరుగబోతోందని సమాచారం అందుకున్న ఆ దేశాధ్యక్షురాలు షేక్ హసీనా భారత్‌కు పారిపోయి వస్తే ఆమెకు మన దేశం ఆశ్రయం కల్పించడమే. 

పాకిస్థాన్ ప్రేరణ కూడా బంగ్లాదేశ్ రెచ్చిపోవడానికి మరో కారణం కావచ్చు. ఆ దేశంలో జైలు నుంచి కరడు గట్టిన 700 మంది హంతకులు, ఉగ్రవాదులు ఇటీవలే తప్పించుకున్నారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రమూకలు కూడా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించిన్నట్లు భారత్‌ నిఘా వర్గాలకు సమాచారం అందింది. 

పాక్ ఉగ్రవాదులు కశ్మీర్, రాజస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి ప్రవేశించడం చాలా కష్టంగా మారడంతో, బాంగ్లాదేశ్ లో నెలకొన్న ఈ అరాచక పరిస్థితులను ఆసరాగా తీసుకొని ఆ దేశం గుండా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు పసిగట్టి భారత్‌-బంగ్లా సరిహద్దుల వద్ద భద్రత మరింత పెంచింది. ఈ సందర్భంగా నిఘా వర్గాలు మరో దిగ్బ్రాంతి కలిగించే విషయం కనుగొన్నారు. 

టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న బేరక్తర్-టీబీ2 రకం ఆరు డ్రోన్లను భారత్‌ సరిహద్దుకు అతి సమీపంలో మోహరించిన్నట్లు కనుగొన్నారు. అవి 25,000 అడుగుల ఎత్తుకి ఎగిరి అక్కడి నుంచే భారత్‌ ఆర్మీ, వాయుసేన స్థావరాల మీద బాంబులతో దాడులు చేయగలవు. 

భారత్‌ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకపోయినా బంగ్లాదేశ్ పాలకులు చాలా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కనుక భారత్‌ కూడా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అదనపు సైనిక బలగాలను మోహరిస్తోంది. ముఖ్యంగా అటు వైపు నుంచి దేశంలోకి ఉగ్రవాదులు జొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 


Related Post