మహారాష్ట్రలో బీజేపి, శివసేనల మహాయుతి కూటమి భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. అయితే ముఖ్యమంత్రి పదవి ఎవరికి? అనే దానిపై రెండు పార్టీల మద్య ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపి పట్టుబడుతుండగా, ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటూ కూటమిని గెలిపించినందుకు మళ్ళీ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
కానీ ఇదివరకు శివసేన-బీజేపి కూటమి మద్య ఇదేవిదంగా సమస్య ఏర్పడినప్పుడు, ఏక్ నాధ్ షిండే చేత శివసేనని నిలువునా చీల్పించి ఆయనను ముఖ్యమంత్రిగా చేసి బీజేపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆ తర్వాత థాకరే శివసేన రాజకీయంగా బలహీనపడి పూర్తిగా దెబ్బతింది.
బహుశః అది గుర్తుంచుకున్న షిండే వెనక్కు తగ్గిననట్లున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలనే విషయం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలే నిర్ణయిస్తారని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. అంటే బీజేపికి ముఖ్యమంత్రి పదవి అప్పగించి తాను హోం లేదా ఉప ముఖ్యమంత్రి పడవితో సర్దుకుపోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పేసిననట్లే. కనుక నేడో రేపో బీజేపి అధిష్టానం మహయ ముఖ్యమంత్రి పేరు ప్రకటించబోతోంది.