ఇంతకీ బిఆర్ఎస్‌ది జాతీయవాదమా... ప్రాంతీయవాదమా?

November 12, 2024


img

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల కోసం టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చుకున్నారు. పేరు మార్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు, మాటలలో ప్రాంతీయతత్వమే ప్రతిధ్వనిస్తుంటుంది. ఇతర రాష్ట్రాలలో రాజకీయాలు చేయాలనుకున్న కేసీఆర్‌ తెలంగాణలో వేరెవరూ రాజకీయాలు చేయకూడదని కోరుకోవడమే ఇందుకు ఓ నిదర్శనం కాగా ప్రతీ ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్‌ రగిలించి లబ్ది పొందాలని ప్రయత్నిస్తుండటం మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రజలకు ఓ విజ్ఞప్తి. ఎవరూ కాంగ్రెస్‌, బీజేపీలకు ఓట్లు వేయొద్దు. మీ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకే ఓట్లు వేసి గెలిపించుకోమని కోరుతున్నాను. కాంగ్రెస్‌, బీజేపీల వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదు. ప్రాంతీయ పార్టీల వల్లనే మేలు కలుగుతుంది,” అని అన్నారు. 

అంటే జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలు మేలని కేటీఆర్‌ చెపుతున్నారన్న మాట! మరి టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా ఎందుకు మార్చుకున్నారు? జాతీయ పార్టీగా ఎదగాలనే కదా? కానీ ఇప్పుడు బిఆర్ఎస్‌కి ఆ అవకాశం లేనందున మళ్ళీ ప్రాంతీయ పల్లవి పాడుతున్నారనుకోవాలేమో? 

పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రన్న జాతీయపార్టీ అయిపోదు. ఆ దిశలో ప్రయత్నాలు చేయాలి. జాతీయ దృక్పదంతో ఆలోచించగలగాలి. కానీ బిఆర్ఎస్‌కి ఆ రెండూ లేవు. కానీ పార్టీ పేరుని మార్చడం వలననే సొంత గడ్డపై ఓడిపోయామని ఆత్మవంచన చేసుకుంటూ మళ్ళీ పార్టీ పేరుని టిఆర్ఎస్‌గా మార్చుకోవాలని ఆలోచనలు కూడా చేస్తోంది కదా?  

అంటే బిఆర్ఎస్ పార్టీ నేతలకి తెలంగాణ విషయంలో స్పష్ఠత ఉంది కానీ తమ జాతీయవాదం విషయంలో నేటికీ స్పష్ఠత లేదని కేటీఆర్‌ మాటలతో స్పష్టమవుతోంది.  కనుక బిఆర్ఎస్‌ పార్టీ ఎప్పటికీ ప్రాంతీయ పార్టీయేనని కేటీఆర్‌ మరోసారి స్పష్టం చేసిన్నట్లయింది. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Delhi: On Telangana CM Revanth Reddy&#39;s statement, BRS working president KT Rama Rao says, &quot;Today the only parties that are actually able to hold off BJP in this country are regional parties. The Samajwadi Party in Uttar Pradesh and the TMC in West Bengal are regional… <a href="https://t.co/3og3HuLhSN">pic.twitter.com/3og3HuLhSN</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1856227267627962687?ref_src=twsrc%5Etfw">November 12, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


Related Post