మహారాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ టోపీ: బండి సంజయ్‌

November 10, 2024


img

ఈ నెల 20న మహారాష్ట్ర, 13, 20 తేదీలలో ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. సిఎం రేవంత్‌ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారం చేసి రాగా, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్‌లో ప్రచారానికి ఏపీ వెళ్ళారు. కేరళలో వయనాడ్‌ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు మంత్రి సీతక్క వెళ్ళారు. 

వీరి పర్యటనలపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ స్పందిస్తూ, “తెలంగాణలో ఎన్నికలప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులని రప్పించి తమ ప్రభుత్వం కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తోందని అబద్దాలు చెప్పించి నమ్మించి గెలిచారు. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో తెలంగాణ సిఎం, డెప్యూటీ సిఎం వెళ్ళి మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందని ఆ రాష్ట్ర ప్రజలని నమ్మించి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు అది ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయనేలేదు. 

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామని సిఎం రేవంత్‌ రెడ్డి బహిరంగంగా చెప్పగలరా?ఆ హామీలను అమలుచేశామని చెప్పుకునేందుకు ధైర్యంగా పాదయాత్ర చేయగలరా?అంటూ ఆరు గ్యారెంటీలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల జాబితాని చదివి వినిపించి వీటిలో ఎన్ని అమలుచేశారో చెప్పాలని బండి సంజయ్‌ నిలదీశారు.


Related Post