త్వరలో ఆటంబాంబు... రెడీగా ఉండండి: పొంగులేటి

November 07, 2024


img

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం వరంగల్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు  చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఓ పక్క ఆ అప్పులు, వడ్డీలు తీర్చుకుంటూనే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల హామీలను కూడా అమలుచేస్తున్నాము.

అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన్నట్లు అవినీతికి పాల్పడినవారికి రోజులు దగ్గర పడుతున్నాయి. త్వరలోనే నాటుబాంబు... లక్ష్మీ బాంబు కాదు ఏకంగా ఆటంబాంబు పేలబోతోంది. అవినీతికి పాల్పడినవారు అందుకు సిద్దంగా ఉండాలి. రూ.55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించారు. ఆ సొమ్ము ఎవరు ఎక్కడికి తరలించారో నిగ్గు తేల్చబోతున్నాము.

దాంతో సంబంధం లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునేవారు తప్పక స్పందిస్తారని భావిస్తున్నాను,” అని అన్నారు.

ఇంతకీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన ఆ  ఆటంబాంబు ఎవరి మీద పడబోతోంది?పడితే కేవలం కేసు నమోదు చేస్తారా లేదా సాక్ష్యాధారాలతో సహా లోపల వేస్తారా? అనేది త్వరలోనే తెలుస్తుంది. ఆయన చెప్పిన్నట్లు భుజాలు తడుముకునేవారు రేపు తప్పకుండా ఏదో కౌంటర్‌ ఇస్తారు. కనుక కొంత క్లూ దొరికే అవకాశం ఉంటుంది. 



Related Post