మజ్లీస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ, “గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో, శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్‌లో ఆ మాత్రం సీట్లు వచ్చాయంటే అది మాపార్టీ దయ వల్లనే.
మేము సహకరించకుంటే బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లో ఒక్క సీటైనా గెలుచుకోగలదా? బిఆర్ఎస్ నాయకుల జాతకాలన్నీ నా దగ్గరున్నాయి. నేను నోరు విప్పి మాట్లాడితే వారికి అవమానమని నేను చెప్పడం లేదు. కానీ మా అండదండలు లేకుండా బిఆర్ఎస్ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు,” అని ఎద్దేవా చేశారు.
మొదటి నుంచి ఇద్దరు ఓవైసీలు ఇదేవిదంగా మాట్లాడుతుండటం అందరూ వినే ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న వారు తమ ముందు తల ఎగరేయలేరు. పాతబస్తీకి వస్తే ఎంతటి వారైనా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. కేసీఆర్ కారు స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది. మేము ఎలా కావాలంటే అలా తిప్పగలము,” అంటూ ఓవైసీలు చాలా మాటలు అనేవారు.
వారు అన్ని మాటలు అంటున్నా నగరంలో, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకొని ఆనాడు కేసీఆర్ ఓవైసీలతో చాలా సక్యతగా ఉంటూ వారికి ఆగ్రహం కలగకుండా జాగ్రత్తపడేవారు. కనుక ఓవైసీ మాటలను పూర్తిగా తప్పుపట్టలేము.
కానీ అదే సమయంలో కేసీఆర్ కూడా మజ్లీస్ పార్టీని హైదరాబాద్, పాతబస్తీకే పరిమితం అయ్యేలా కట్టడి చేశారు. అందువల్లే మజ్లీస్ పార్టీ దేశంలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసేది కానీ ఇంతవరకు హైదరాబాద్ దాటి తెలంగాణలో మరెక్కడా పోటీ చేయలేదు. కనుక ఎవరు ఎవరిని కట్టడి చేశారో అర్దం చేసుకోవచ్చు.
బిఆర్ఎస్ పార్టీపై అసదుద్దీన్ ఓవైసీ హటాత్తుగా ఈవిదంగా విరుచుకుపడటానికి బలమైన కారణమే ఉంది. ఇది జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం మొదలుపెట్టిన కొత్త డ్రామాయే.
గత ఎన్నికలకు ముందు వరకు కూడా కేసీఆర్‌తో అంటకాగిన అసదుద్దీన్ ఓవైసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల గంట మ్రోగగానే ఇద్దరూ ‘తలాక్’ చెప్పేసుకొని పరస్పరం కత్తులు దూసుకుంటూ ఒట్టొట్టి యుద్ధాలు చేస్తూ నగర ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎవరి వాటా ఓట్లు, సీట్లు వారు దండుకున్నారు.
మళ్ళీ ఇప్పుడే అదే చేయబోతున్నామని ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ, రేపు కేటీఆర్ లేదా హరీష్ రావు ఇవ్వబోయే కౌంటర్‌లతో నిరూపించబోతున్నారు.
ఎవడు అధికారంలో ఉంటే వాడికి వంతపాడడంలో నీకున్నంత కన్సిస్టెన్సీ ఇంకెవడికీ లేదులేరా !! https://t.co/tN1OsTiHQ8
— తెలుగు తీపి (@kkmohan73) November 2, 2024