ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బిహార్‌లో ‘జన సురాజ్’ అనే పార్టీని పెట్టుకొని ఎన్నికలకి సిద్దం అవుతున్నారు.
ఇటీవల తన పార్టీ ఆర్ధిక పరిస్థితి గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నేను ఏదైనా ఓ రాజకీయ పార్టీకి సేవలందిస్తే కనీసం వంద కోట్లు ఫీజు తీసుకునేవాడిని. కనుక నేను ఏదైనా ఒక్క పార్టీకి పనిచేస్తే చాలు నా పార్టీ రెండేళ్ళ నిర్వహణ ఖర్చులు సంపాదించుకోగలను,” అని చెప్పారు.
ఆయన ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్, బీజేపీలతో సహా అనేక పార్టీలకు పని చేశారు కనుక బాగానే సంపాదించుకుని ఉండవచ్చు. ఆ ధైర్యంతోనే సొంత పార్టీ పెట్టుకొని ఉండవచ్చు.
ఇదివరకు కేసీఆర్ తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు ఆయనని ప్రగతి భవన్‌కి పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ప్రశాంత్ కిషోర్ నాకు ఆప్త మిత్రుడు. కనుక ఒక్క రూపాయి తీసుకోకుండా బిఆర్ఎస్ పార్టీకి సేవలందించేందుకు అంగీకరించారు,” అని కేసీఆర్ చెప్పారు. కానీ ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కోసం పని చేయలేదు.
కేసీఆరేఆయన సేవలు పార్టీకి అవసరం లేదని భావించి వద్దనుకున్నారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బయటపెట్టిన విషయం వింటే, ఆయనకు వందకోట్లు ఇచ్చేందుకు కేసీఆర్ ఇష్టపడకనే వద్దనుకున్నారని అర్దమవుతోంది. కానీ జగన్ ప్రశాంత్ కిషోర్‌కి వంద కోట్లు చెల్లించి 2019లో ముఖ్యమంత్రి కాగలిగారు.