త్వరలో పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

November 01, 2024


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో ‘ఆస్క్ కేటీఆర్‌’ పేరుతో నెటిజన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కోరిక మేరకు తాను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇది వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఓటమి, ఎమ్మెల్యేల ఫిరాయింపుల  తర్వాత ఢీలా పడిపోయిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇది చాలా ఉత్సాహం కలిగిస్తోంది.

కానీ కేటీఆర్‌ స్థాయి నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలంటే ముందుగా చాలా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ ఫిరాయింపులు, శాసనసభ సమావేశాలు వంటి లెక్కలన్నీ చూసుకోవలసి ఉంటుంది. కనుక త్వరలో పాదయాత్ర మొదలుపెట్టకపోవచ్చు. 

ఏపీలో టిడిపి యువనేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేసి తన సత్తా చాటుకోవడమే కాకుండా వైసీపి నేతల, జగన్‌ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక విలవిలలాడుతున్న టిడిపి శ్రేణులకు ధైర్యం చెప్పి మళ్ళీ ఉత్సాహంతో ఉరకలు వేసేలా చేయగలిగారు. 

టిడిపి కూటమి విజయానికి యువగళం పాదయాత్ర కూడా ఓ ప్రధాన కారణం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్‌ మంత్రి పదవి చేపట్టి ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టడం చాలా మంచి ఆలోచనే అని చెప్పొచ్చు. 


Related Post