కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసి ఘోష్ కమీషన్ ఎదుట ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సూధాకర్ రెడ్డి హాజరయ్యారు. జస్టిస్ పీసి ఘోష్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిలదీస్తుంటే ఒకానొక దశలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకి ముందు అనుకున్న అంచనాలను ఎందుకు పెంచారు? పెంచాలనే నిర్ణయం ఎవరిది?
సమగ్ర నివేదికకు టెండరింగ్ ప్రక్రియ ఎందుకు చేపట్టలేదు? నామినేషన్ పద్దతిలో వ్యాప్కోస్ కంపెనీకి ఎందుకు అప్పగించారు? ఆ నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం కమీషన్ ఎవరు ఏర్పాటు చేశారు? పనులు పూర్తవకుండానే పూర్తయిన్నట్లు సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు?
సర్టిఫికేట్ జారీ చేసే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్నారా లేదా?నిర్మాణ సంస్థకు ఇచ్చిన పత్రాలు, అది మీకు ఇచ్చిన పత్రాలు అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో పరిశీలించుకున్నారా లేదా? ఏవీ పరిశీలించకుండా నిర్మాణ సంస్థకు గుడ్డిగా సంతకం ఎందుకు చేశారు?చేయమని ఎవరైనా ఒత్తిడి చేశారా?
మేడిగడ్డ బ్యారేజి కింద గతంలో బొగ్గు గనులు ఉండేవని మీకు తెలుసా లేదా? ఉంటే బ్యారేజీ క్రుంగిపోయే అవకాశం ఉంటుందా లేదా? మేడిగడ్డ బ్యారేజిలీ మూడు పిల్లర్లు ఎందువల్ల క్రుంగిపోయాయి? డిజైన్ లోపమే అయితే దానికి ఎవరు బాధ్యులు? అంటూ పీసి ఘోష్ కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ సందర్భంగా జస్టిస్ పీసి ఘోష్ ఆయనకు ఓ ఆసక్తికర సూచన చేసిన్నట్లు తెలుస్తోంది. ఎవరో చేసిన తప్పులను దాచిపెట్టాలని ప్రయత్నించవద్దు. దాచిపెట్టి మీరు ఇరుక్కోవద్దు. జరిగినవి జరిగిన్నట్లు చెపితే మీకే మంచిది,” అని చెప్పిన్నట్లు తెలుస్తోంది.