పవన్ కళ్యాణ్ వెంటపడుతున్న ప్రకాష్ రాజ్!

October 08, 2024

img

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హటాత్తుగా వేషం, ఆలోచనలు మార్చుకొని సనాతన ధర్మం అంటూ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతుండటంతో నటుడు ప్రకాష్ రాజ్‌ ఆయనని జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నిస్తూనే ఉన్నారు.

తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలలో అన్నాడీఎంకే ఒకటి. దాని వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎంజీఆర్. ఈ నెల 17న ఆ పార్టీ 53వ వ్యవస్థాపక దినోత్సవం జరుగబోతోంది. పవన్‌ కళ్యాణ్‌ ఏనాడూ ఆ పార్టీ గురించి మాట్లాడింది లేదు. కానీ సనాతన ధర్మ మార్గం ఎంచుకున్న తర్వాత తొలిసారిగా స్వర్గీయ ఎంజీఆర్‌ని పొగుడుతూ, ఆ పార్టీ నేతలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

దానినే ప్రకాష్ రాజ్‌ ప్రశ్నించారు. “అకస్మాత్తుగా ఎంజీఆర్‌ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది దేనికో... పైనుంచి ఆదేశాలు అందాయా? #జస్ట్ ఆస్కింగ్,” అని ట్వీట్‌ చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ ఆయన జోలికి పోకపోయినా ఆయన మాత్రం పవన్‌ కళ్యాణ్‌ని విడిచిపెట్టేలా లేరు. మెగా ఫ్యామిలీకి సినీ పరిశ్రమపై మంచి పట్టుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రకాష్ రాజ్‌కి ఇబ్బంది కలిగేలా ఏమైనా చేయగల శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నారు. ఇది తెలిసీ ప్రకాష్ రాజ్‌ పవన్‌ కళ్యాణ్‌ వెంటపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

MGRపై హ‌ఠాత్తుగా ఎందుకింత‌ ప్రేమో..
పైనుంచి ఆదేశాలు అందాయా..
జ‌స్ట్ ఆస్కింగ్ #justasking https://t.co/nrr3ERGAyF
— Prakash Raj (@prakashraaj) October 6, 2024

Related Post