దేశ ప్రజలందరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఏ అంశంపైనైనా వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉంది. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. అనేక సినిమాలలో విలన్‌గా నటించిన ప్రకాష్ రాజ్‌కి ఈ విషయం అందరి కంటే బాగా తెలిసి ఉంటుంది.
తిరుమల వ్యవహారంపై తన అభిప్రాయాలను నలుగురితో పంచుకుంటే ఆయనకే ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంటుందనే విషయం ఇంకా గ్రహించిన్నట్లు లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల తీరును తప్పు పడుతూ వరుసపెట్టి ట్వీట్స్ వేస్తున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయనని ఉద్దేశ్యించి పరోక్షంగా “కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … ఇప్పటికే చేసింది చాలు. ఇకనైనా ప్రజలకు ఏమి అవసరమో దానిపై దయచేసి దృష్టి పెట్టండి… #జస్ట్ ఆస్కింగ్” అని ట్వీట్ చేశారు.
ఇవాళ్ళ గాంధీ జయంతి, దివంగత ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మతరాజకీయాలు, లౌకికవాదంపై వారి కొటేషన్స్ ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు.
ఈవిదంగా ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వంపై కత్తులు దూస్తుండటం ద్వారా ఆయన ఏమి సాధించాలనుకుంటున్నారో తెలీదు కానీ ఇది తప్పకుండా ఆయన సినీ కెరీర్‌ని దెబ్బ తీసే ప్రమాదం ఉంటుందని గ్రహించిన్నట్లు లేదు.