జస్ట్ ఆస్కింగ్: దేవుడితో రాజకీయాలు వద్దు!

October 01, 2024


img

తిరుమల నెయ్యి కల్తీ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాధన్‌లు చేసిన వ్యాఖ్యలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. 

ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలా? తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తదుపరి విచారణని గురువారానికి వాయిదా వేశారు. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ స్పందిస్తూ “దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి” అని రెండు చేతులతో దణ్ణం పెడుతున్న ఇమోజీలను పోస్ట్ చేస్తూ #జస్ట్ ఆస్కింగ్,” అని ట్వీట్‌ చేశారు. 

ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలున్నాయి. 

కనుక వారిరువురూ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అలా చేయవద్దని ప్రకాష్ రాజ్‌ వారికి నేరుగా చెప్పిన్నట్లే భావించవచ్చు. మరి దీనిపై టిడిపి శ్రేణులు, పవన్‌ కళ్యాణ్‌ ఏవిదంగా స్పందిస్తారో?


Related Post