తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. వారిలో కొందరు ఈ పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీ అమితంగా ద్వేషించే నటుడు ప్రకాష్ రాజ్ కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తూ, “ప్రియమైన పవన్ కళ్యాణ్‌గారు... మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దీనిపై విచారణ జరిపించి దీనికి బాధ్యులపై కటినమైన చర్యలు తీసుకోగలరు.
అయితే దీనిపై అనవసర భయాలు సృష్టిస్తూ దేశవ్యాప్తంగా చర్చించేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తఠఌ చాలు. (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాధాలు #జస్ట్ ఆస్కింగ్)” అని ట్వీట్ చేశారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోమనడం సబబుగానే ఉంది కానీ ఏపీ ప్రభుత్వం పనిగట్టుకొని దీనిని జాతీయస్థాయి వివాదంగా మార్చిందని, దానికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు తోడ్పడుతున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించిన్నట్లు అర్దమవుతోంది.
దీనిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందిస్తూ, “మీరు మరీ అంతగా అసహనం ప్రదర్శించక్కరలేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు నావంటి కోట్లాదిమంది హిందువుల నమ్మకానికి ప్రతీక.
పవన్ కళ్యాణ్‌గారు ఇప్పటికే దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని తిరుమల పవిత్రతని కాపాడవలసిందిగా కోరారు. ఈ వ్యవహారంలో మతం రంగు ఎక్కడ కనిపిస్తోంది మీకు? మీ పరిధిలో మీరు ఉంటే మంచిది,” అని ట్వీట్ చేశారు.