జమిలి ఎన్నికలకు మేము వ్యతిరేకం: ఓవైసీ

September 18, 2024


img

కేంద్ర మంత్రివర్గ సమావేశం జమిలి ఎన్నికలకు ఆమోదముద్ర వేయగానే దేశంలో రాజకీయ పార్టీలు స్పందించడం మొదలుపెట్టాయి. మజ్లీస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “జమిలి ఎన్నికలు దేశంలో మోడీ, అమిత్ షాలకు తప్ప మరెవరికీ అవసరం లేదు. 

మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు అన్నిటికీ ఒకేసారి రాజకీయ పార్టీలు ఏర్పాట్లు, ప్రచారం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. దాని వలన కేవలం చాలా బలమైన పార్టీలు మాత్రమే పోటీ చేయగలుగుతాయి చిన్న చిన్న పార్టీలు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక ప్రజాస్వామ్యనికి ఇవి విరుద్దంగా అవుతాయి. కనుక ఈ ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు. 

జమిలి ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు ఓ కమిటీ వేసి దాని సిఫార్సుతో ఆ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ఏకపక్ష నిర్ణయంగానే భావించాల్సి ఉంటుంది. దేశంలో ప్రధాన పార్టీల అభిప్రాయాలను తీసుకొని, వాటిని కూడా ఈ కమిటీలో భాగస్వాములుగా చేసి ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా ఉండేది. అయితే ఈ ప్రతిపాదనకు  రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది కనుక బీజేపీయేతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ఈ ప్రతిపాదనను పార్లమెంట్‌లో తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం.


Related Post