హైడ్రా సంస్థ ఈ రెండు నెలల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 ప్రాంతాలలో 262 అక్రమ కట్టడాలని కూల్చివేసి 11.72 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. వాటిలో అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, సున్నం చెరువు పరిధిలో 42 ఎకరాలు, పెద్దచెరువు పరిధిలో 24 ఎకరాలు, గగన్ పహాడ్ అప్పా చెరువు పరిధిలో 14 ఎకరాలు, మనెమ్మ గల్లీలో 3 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నీఎధికలో పేర్కొంది.
హైడ్రా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 15 మంది సీఐలు, 8 మంది ఎస్సైలను అదనంగా కేటాయించింది.
హైడ్రా ఇప్పుడు మూసీ నది ఆక్రమణలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే చాదర్ ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాలలో ఆక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసింది. మూసీలో సుమారు 10,000 ఆక్రమణలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.
వాటిలో నిరుపేదలు, ధనవంతులు, రాజకీయ పలుకుబడి గలవారు చాలా మంది ఉన్నారు. పైగా ఆ ప్రాంతంలో మజ్లీస్ పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక హైడ్రాకి మూసీ ఆక్రమణలు తొలగించడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు.
మూసీలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి ఖాళీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ వాళ్ళని ఒప్పించడం, అంతమందికి ఇళ్ళు కేటాయించడం రెండూ కష్టమే. మరి హైడ్రా మూసీని ఏవిదంగా ఆక్రమణల నుంచి విడిపిస్తుందో?