సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి కేసీఆర్ ప్రభుత్వం ధైర్యం చేయలేక, అలాగని హిందూ ఓట్లను వదులుకోలేక భారత్‌లో తెలంగాణ ‘విలీన దినోత్సవం’ పేరుతో వేడుకలు జరిపేవారు. కానీ అవి కూడా అధికారికంగా కాదు... కేవలం పార్టీ పరంగానే.
ఓవైసీలకు భయపడి, రాష్ట్రంలో ముస్లింల ఓట్ల కోసమే కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపించడం లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేవారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మజ్లీస్ పార్టీ కాంగ్రెస్‌కి మిత్ర పక్షమూ కాదు... ఓవైసీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. కనుక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని సీపీఐ నారాయణ సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరి సిఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏవిదంగా స్పందిస్తారో?