హైడ్రా జోరుకి బ్రేకులు పడిన్నట్లేనా?

September 08, 2024


img

హైదరాబాద్‌ నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించే ప్రయత్నంలో కొన్ని వందల అక్రమ కట్టడాలని కూల్చివేసింది. అయితే ప్రముఖుల అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నప్పుడు రాజకీయ ఒత్తిళ్ళని ప్రభుత్వం, హైడ్రా అధిగమించగలిగింది కానీ నేడు మాధాపూర్ సున్నం చెరువు వద్ద పేదల ఇళ్ళని కూల్చివేస్తున్నప్పుడు వారు తీవ్రంగా ప్రతిఘటించడంతో హైడ్రా వెనక్కు తగ్గక తప్పలేదు. ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఒంటిపై కిరోసిన్‌, పెట్రోల్ పోసుకొని తమ ఇళ్ళు కూల్చివేస్తే సామూహిక దహనం చేసుకుంటామని బెదిరించడంతో హైడ్రా అధికారులు, పోలీసులకు ఏమి చేయాలో పాలుపోక వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీంతో హైడ్రా కమీషనర్ రంగనాధ్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ప్రజలు నివశిస్తున్న ఇళ్ళని కూల్చబోమని కానీ ఎఫ్‌టిఎల్, బఫర్ బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్దంగా కొత్తగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తామని చెప్పారు. రెండు నెలల క్రితం హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా వెనకడుగు వేసిన్నట్లు భావించవచ్చు. 

అయితే అక్రమ కట్టడాలను కూల్చివేయడమే కాక వాటిని నిర్మించి అమ్ముకున్న బిల్డర్స్ వద్ద నుంచే ఆ సొమ్ముని వసూలు చేసి కొనుగోలుదారులకు  చెల్లింపజేస్తే హైడ్రా కూల్చివేతలపై ఇంతగా వ్యతిరేకత ఏర్పడకపోవచ్చు. కానీ ఇది ఇంకా చాలా కష్టమైన ప్రక్రియ. కానీ ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదని హైడ్రా నిరూపించి చూపింది కదా... అలాగే ఇదీను!


Related Post