ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు పట్టుకోవాల్సిందే!

September 07, 2024


img

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా కులాలతో ఎన్నికలలో గెలవడం అసాధ్యం. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పటాన్‌చెరు నుంచి పోటీ చేయాలనుకుంటే రూ.100 కోట్లు పట్టుకుంటేనే సాధ్యం అవుతుంది.

ఇప్పుడు చేతిలో ఈ మాత్రం పైసల్ లేకుండా ఎన్నికల బరిలో దిగడం వృద్ధాయే. కులాల లెక్కల కంటే పైసల్ లెక్కలే ముఖ్యం,” అని కుండ బద్దలు కొట్టారు.

జగ్గా రెడ్డి మాజీ ఎమ్మెల్యే కనుక ఆయన చెపుతున్నది వాస్తవమే అని భావించవచ్చు. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఇలాంటి భ్రమతోనే 5-6 ఏళ్ళు సర్వీసు ఉండగానే ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని బీఎస్పీతో రాజకీయాలలోకి వచ్చారు.

బడుగు బలహీన వర్గాల ఓట్లు ముఖ్యంగా దళితుల ఓట్లు తమకే పడతాయనుకున్నారు. కానీ ఆయనతో సహా ఆ పార్టీ లో ఏ ఒక్కరూ గెలవలేదు. దాంతో భ్రమలు తొలగిపోయి బిఎస్పీకి రాజీనామా చేసి అంతవరకు ఎవరిని విమర్శించారో ఆయన వద్దకే ‘దొర’ అంటూ చేరిపోయారు.

దొర అండతో నాగర్‌కర్నూల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినా ప్రవీణ్ కుమార్‌ ఓడిపోయారు. అంటే జగ్గారెడ్డి చెప్పిన్నట్లు ఎన్నికలలో గెలవాలంటే కులాలు పనికిరావు పైసల్ ముఖ్యమని భావించవచ్చు. 


(video courtecy: Telugu Scrine)


Related Post