హైడ్రా ఎందుకో ఇప్పటికైనా అర్దమైందా?

September 01, 2024


img

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సిఎం రేవంత్‌ రెడ్డి చాలా సాహసోపేతమైన మంచి నిర్ణయం తీసుకొని ధైర్యంగా అమలుచేస్తున్నారని ప్రశంశిస్తుండగా, కొందరు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జోరుగా వర్షాలు కురుస్తున్నప్పుడు పేదల ఇళ్ళు కూల్చేసి వారిని రోడ్డున పడేశారని విమర్శిస్తున్నారు. 

నాగార్జున ఎన్‌ కన్వేషన్ కూల్చివేస్తే సినీ పరిశ్రమలో ఒక్కరూ కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనీసం సిఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామనో లేదా వ్యతిరేకిస్తున్నామనో ఎవరూ చెప్పలేదు. కానీ సినీ పరిశ్రమ నుంచి తొలిసారిగా నటుడు నాగబాబు స్పందిస్తూ సిఎం రేవంత్‌ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించారు. 

“వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే .. ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్... Let's appreciate our honorable CM @revanth_anumula garu for your dare decisions and commendable work. We stand with you in full support. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌... కచ్చితంగా... మీ నాగబాబు...” అని ట్వీట్‌ చేశారు. 


Related Post