గత ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాక, ఆ రూపురేఖలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. అయితే సచివాలయంలో ప్రతిష్టించబోయే తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలందరికీ కన్నతల్లిని మరిపించేలా ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జవహార్‌లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌కి తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యత అప్పగించామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాదని స్పష్టం చేశారన్న మాట!
డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజునాడు లక్షల మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాజముద్రని మార్చబోతే బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో అందరూ కల్వకుంట్ల కవిత తిరిగిరావడంతో ఆ హడావుడిలో ఉన్నారు. అది తగ్గిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడకుండా ఉండరు.