ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నప్పుడు సీబీఐ, ఈడీల తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజుని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ఓ సూటి ప్రశ్న వేశారు.
ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కల్వకుంట్ల కవిత కలిసి ఈ కుంభకోణం చేశారని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేశారు కానీ ఆయనని ఎందుకు అరెస్ట్ చేయలేదు?ఈ కేసులో ఆయన నిందితుడు అయినప్పుడు ఎలా విడిచిపెట్టారు?
అంటే మీ ఇష్టం వచ్చినవాళ్ళని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేస్తారు. వద్దనుకున్నవాళ్ళని మీరు పట్టించుకోరు. అంతేగా? ఈ కేసులో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ రెడ్డి నిందితుడని పేర్కొంటూ అరెస్ట్ చేశారు. కానీ తర్వాత అప్రూవరుగా మారరంటూ ఆయన పేరుని నిందితుల జాబితాలో నుంచి తొలగించారు. ఈ కేసులో ఒక్కో వ్యక్తి పట్ల ఒక్కో రకంగా వ్యవహరించడం మీ విశ్వసనీయతని ప్రశ్నార్ధకంగా మార్చుతుంది కదా?” అని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నకు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు సమాధానం చెప్పలేకపోయారు