ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌పై ఎటువంటి స్టే లేదు: హైడ్రా

August 24, 2024


img

ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేత వ్యవహారంపై నాగార్జున నేడు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి స్టే (మద్యంతర ఉత్తర్వులు) తెచ్చుకున్నారు. కానీ అప్పటికే మొత్తం నేలమట్టం చేశామని హైడ్రా కమీషనర్‌ ఏవీ రంగనాధ్ చెప్పారు.

దానిపై హైకోర్టులో స్టే ఉందనే నాగార్జున అబద్దం చెపుతున్నారని, దానిపై హైకోర్టులో ఇదివరకు ఎటువంటి స్టే లేదని ధృవీకరించుకున్న తర్వాతే కూల్చివేశామని స్పష్టం చేశారు. 

ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లలో ఎటువంటి కట్టడాలు నిర్మించరాదు. దీనికి సంబందించి 2014లోనే తుమ్మిడికుంట చెరువు పూర్తి విస్తీర్ణం, బఫర్ జోన్ వివరాలను ప్రకటిస్తూ ప్రాధమిక నోటిఫికేషన్‌ వెలువడింది.

ఆ తర్వాతే ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశం మేరకు దాని యజమాన్యం సమక్షంలోనే అప్పుడే ఎఫ్‌టిఎల్ సర్వే కూడా చేసి ఆ నివేదిక కూడా అందించారు. 

ఆ సర్వే నివేదికపై జిల్లా జడ్జి కోర్టులో కేసు ఉంది కానీ దానిపై న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వలేదు. అలాగే హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు.

గతంలోనే ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేయవద్దని అధికారులని అభ్యర్ధనలు వచ్చాయి. కానీ వాటిని అప్పుడే తిరస్కరించారు. కనుక చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించైనా ఆ కట్టడాన్ని మేము కూల్చివేశాము,” అని చెప్పారు.


Related Post