మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు రాష్ట్ర మహిళా కమీషన్ ఎదుట హాజరయ్యి, అవి యధాలాపంగా అన్న మాటలే తప్ప మహిళలని కించపరిచే ఉద్దేశ్యంతో అనలేదని చెప్పారు. అయ్తినప్పటికీ తన మాటల వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని కోరానని కూడా చెప్పారు.
అయితే మహిళా కమీషన్ ఆయన సున్నితంగా మందలిస్తుందని భావించగా, వారు తమ అభిప్రాయాన్ని మరో విధంగా తెలియజేయడం విశేషం. మహిళా కమీషన్ సభ్యులు కొందరు కేటీఆర్ చేతికి రాఖీలు కట్టారు. తద్వారా మహిళలపట్ల సోదరభావంతో మెలగాలని సూచించిన్నట్లు భావించవచ్చు. ఆ తర్వాత వారందరూ కేటీఆర్‌తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమీషన్ సరిగ్గానే అర్దం చేసుకొని హుందాగానే వ్యవహరించింది. కానీ ఇందుకు కోసం కాంగ్రెస్ ప్రభుతవిమర్శిస్తున్న కేటీఆర్‌కి రాఖీలు కట్టడం, పోటీలు పడి ఆయనతో సెల్ఫీలు దిగడం ప్రభుత్వాధినేతకు ఆగ్రహం కలిగిస్తుందేమో కదా?