కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాలు విసిరారు. రాష్ట్ర ఆర్దిక మంత్రిగా చేసిన అనుభవంతో కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేయలేదనే భావించారు. అందుకే ఆ సవాలు విసిరారు. కానీ ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకుంది.
సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన్నట్లుగానే ఆగస్ట్ 15లోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశారు. కనుక హరీష్ రావుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సగం మంది రైతులకే పంట రుణాలు మాఫీ చేసి మిగిలినవారికి చేయకుండా మోసం చేస్తోందనే హరీష్ రావు వాదనలను రైతులు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, అర్హత ఉండి రుణాలు మాఫీ కానీ వారి కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలలో డెప్యూటీ కలెక్టర్లకు బాధ్యత అప్పగించారు. కనుక మిగిలిన రైతులు కూడా నమ్మకంగానే ఉన్నారు.
దీంతో హరీష్ రావు మరో కొత్త ఐడియా చేశారు. “రేవంత్ రెడ్డి పంట రుణాలు మాఫీ చేస్తానని చెప్పి దేవుళ్ళపై ఓట్లు వేసి వారిని కూడా మోసం చేశారు కనుక తెలంగాణ ప్రజలపై దేవుళ్ళు ఆగ్రహించకూడదని తాను స్వయంగా వేడుకుంటానని, అందుకోసం గుళ్ళు గోపురాలు, దర్గాలు, మసీదులు, చర్చీల యాత్రకు బయలుదేరుతానని హరీష్ రావు ప్రకటించారు. అది చూసి కాంగ్రెస్ నేతలే కాదు... ప్రజలు కూడా నవ్వుతున్నారు. పాపం హరీష్ రావు... రేవంత్ రెడ్డికి అడ్డంగా దొరికిపోయారు. అయినా అపర చాణక్యుడు అనుకునే తన మామ కేసీఆర్‌నే రేవంత్ రెడ్డి ఓడించి మూలకూర్చోబెట్టిన్నప్పుడు, ఆయన ముందు నేనెంత? అని ఆలోచించి ఉంటే ఇంత అత్యుత్సాహం ప్రదర్శించేవారే కాదు కదా?